Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
మనబస్తీ మనబడి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రైవేట్ పాఠశా లలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 15వ డివిజన్ మొగిలిచెర్ల ఎంపీపీఎస్ మనబస్తీ మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.22.25 లక్షలతో చేపట్టిన కాం పౌండ్వాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ తదితర అభివద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని సమగ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మనఊరు మనబడి కార్యక్ర మం ద్వారా వరంగల్ జిల్లాలో 26, హనుమకొండ జిల్లాలో 28 పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థులకు దశలవారీగా డిజిటల్ విద్య వి ధానాన్ని ప్రవేశపెట్టి, వారి అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకే మౌలిక వ సతుల ఏర్పాటుకై ఈపథకం రూపొందించామన్నారు. గత పాలకులు ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారన్నారు. విద్యార్థుల సంఖ్యపెంపుకు ఉపాధ్యాయులు కషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీవత్స, డీఈవో వాసంతి, స్థానిక కార్పొరే టర్ ఆకులపల్లి మనోహర్, 16,17వ డివిజన్ కార్పొరేటర్లు సుంకరి మనిషా శివ, గద్దె బాబు, గీసుకొండ జడ్పిటిసి పోలీస్ ధర్మారావు, సెక్టోరియల్ అధికారి సుధీర్ బాబు, సొసైటీ చైర్మన్ దొంగల రమేష్ వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, విద్య కమిటీ చైర్మన్ దండ్రే అశోక్, గ్రామ విద్యాభివద్ధి కమిటీ చైర్మన్ మద్దెల నర్సింగరావు,అధికారులు మురళీధర్, శారద, శంకరయ్య, సత్యనా రాయణ, స్వరూప, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.