Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
విద్యుత్ కోతలకు నిరసనగా బుధవారం మండ లంలోని కాపుల కనుపర్తి సబ్‌స్టేషన్ వద్ద గవిచర్ల ఎంపీటీసీ గూడ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథులుగా కాంగ్రెస్ కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు బొం పల్లి దేవేందర్‌రావు, టీపీసీ సీ కో-ఆర్డినేటర్ బొమ్మ న పల్లి అశోక్‌రెడ్డి కాంగ్రెస్ జి ల్లా మహిళా అధ్యక్షురాలు కర్ణంటి పార్వతమ్మ హాజరై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ గత వారం పది రోజుల నుండి కరెంటు గం టకోసారి పోతుండడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఒకపక్క యాసంగి ఎకరాల కొద్దీ మొక్కజొన్న వరి విస్తరించ డం జరిగిందన్నారు. పంట చేతికందేసమయంలో కరెంటు కోతలతో ఈ పంటలు పూర్తిగా పాడవుతు న్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు అధికారు ల దగ్గరికి వెళ్లి అడుగుతే మేము ఏది చెప్తే అదే నిర్ణ యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా కరెం టు కోతలు జరుగుతే పంటలు పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ల ఆత్మహత్యలేతప్ప రైతులకు మేలు జరిగిందేది లేద ని ఇకనైనా రైతులపక్షాన ఉండాలని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గూడ సంపత్ రెడ్డి కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి ర మేష్ మడత కేశవులు కిసాన్ కాంగ్రెస్ మండల అధ్య క్షులు అచ్చ నాగరాజ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు గుండేటి రాజకుమార్, మండల కార్యదర్శి భాషాపాక సదానందం, మండల ఉపాధ్యక్షులు గొల్లపల్లి చంద్ర శేఖర్, గవిచర్ల గ్రామ పార్టీఅధ్యక్షులు బాసిపాక యా కుబు, నాయకులు నవీన్‌రెడ్డి, బట్టిమేకల ఐలయ్య, సీ నియర్ నాయకులు రాధాకష్ణ గోలి రవీందర్ పూనూ రి సతీష్, ఎండి.మౌలాన,పాక శీను గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.