Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్
భవన, ఇతర నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల సంక్షేమ అభివద్ధిని తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మ రిస్తుందని ఐఎఫ్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షులు పసునూరి రాజు ఆగ్రహం వ్య క్తం చేశారు.బుధవారం భారత కార్మిక సం ఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్ జి ల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భవన, ఇత ర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పరిపాలన అధికారి శ్రీకాంత్‌కి వినతి ప త్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరల వలన కార్మిక కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. కార్మికుల సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాద వశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని అన్నారు. పనిచేస్తు న్న క్రమంలో శాశ్వత అంగవైకల్యం కలి గితే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందజే యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పెండ్లి, ప్రసవాలకు రూ. 30 వేల నుండి రూ.1లక్ష వరకు పెంచాలని, 60 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు.ఇల్లు లేని కార్మికుల కుటుంబాలకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని, స్థలాలు ఉన్న వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మోటార్ సైకిల్ అందివ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు వరంగల్ జిల్లా నాయకులు అడ్డూరి రాజు, మైదం పాణి,సాబిరికాని మోహన్, ఎస్ విద్యాసాగర్, గాడి పెళ్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.