Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి
నవతెలంగాణ-ఖానాపురం
ఎఫ్ఓఎఫ్ఆర్ చట్టంలో చూపిన నిబంధనలకు లోబడి పోడు భూముల పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేసేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీ.గోపి అధికారులను ఆదేశించారు. బుధవారం పోడు భూముల, అటవీ సంరక్షణపై జిల్లా స్థాయిలో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి గోపి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఓఎఫ్ఆర్ కమిటీ సభ్యులతో పాటు మండల ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉన్న నాలుగు మండలాల నుండి మొత్తం 7711 మంది పట్టాపాస్ పుస్తకాల కొరకు దరఖాస్తు చేసుకోగా గ్రామ, డివిజనల్ స్థాయిలో 1471 దరఖాస్తులు అనేక కారణాల చేత తిరస్కరణకు గురికాగా మిగిలిన దరఖాస్తులన్నీ అర్హత సాధించి ఉన్నతస్థాయి కమిటీకి పంపించబడ్డాయని పేర్కొన్నారు. మరో వారం పది రోజుల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాలు ప్రింట్ అవుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 3486 ఎకరాల పోడు భూమికి 58 గ్రామాల నుండి ఆర్వోఎఫ్ఆర్ దరఖాస్తులు అందగా అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 23వ తేదీ కంటే ముందు ఖాస్తులో ఉన్న వారినే హక్కుదారులుగా గుర్తించడం జరుగుతుందని నిర్ణీత సంవత్సరం తరువాత కొత్తగా పోడు భూమి కొరకు వెవరు చెట్లను నరికినా ఆ సాగుదారులను అనర్హులుగా గుర్తించామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గం మొత్తం 7,711 మంది పట్టా పాస్ బుక్కుల కొరకు దరఖాస్తు చేసుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.గ్రామ, డివిజనల్ స్థాయిలో 1,471 ధరాఖాస్తులు వివిధ కారణాల చేత తిరస్కరించబడ్డాయని,అర్హత కలిగిన దరఖాస్తులన్నీ ఉన్నతస్థాయి కమిటీకి జారీ చేశామని తెలిపారు. రానున్న పది రోజులలో పోడు భూముల పట్టా పాస్ బుక్కులు ప్రింట్ చేయబడుతున్నట్టుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ఖానాపురం మండల ఎంపీపీ వేములపల్లి ప్రకాశరావు జిల్లా కలెక్టర్ సమక్షంలో మండలంలో మొత్తం 9 గ్రామాలకు చెందిన రైతులు ఎన్నో ఏండ్లగా పోడు భూములు సాగు చేసుకుంటూ కాస్తులు ఉన్నారని, రైతులకు చెందిన సొంత భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమని చెప్పి, సదరు బోర్డునుండి నోటీసులు వచ్చాయని, గత 50 ఏండ్ల ముందు నుండే రైతులు పోడు భూములను సాగు చేసుకుంటున్నారని, పోడు భూముల రైతుల హక్కులను గుర్తించి అర్హత గల పోడు భూముల రైతులకు పట్టా పాస్ బుక్కులను అందించాలని కోరారు. ఎంపీపీ వెంట బత్తిని స్వప్న శ్రీనివాస్, గుగులోతు కిషన్, బాలకిషన్ ఉన్నారు.