Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్రూరల్
కెసిఆర్ పాలనలో సర్కార్ బడులలో సకల వస తుల ఏర్పాటు జరుగుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని మాటేడు గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో నూతన తరగతి గదు లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయనమాట్లాడుతూ ప్రభుత్వ పాఠ శాలలో ప్రజల భాగస్వామ్యం బాధ్యతగా తీసుకోవా లని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రజాఉపయోగ పథకాలు ఏ రాష్ట్రంలో చేయలేదన్నారు .తెలంగాణ రాష్ట్రంలో 7289 కోట్ల రూపాయలతో చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసు కుందని మహబూబాబాద్ జిల్లాలో తొలిసారిగా మా టేడు గ్రామంలో అధునాతన వసతులతో 3 డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి నూతనంగా ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే విద్యా బోధన బాగుందన్నారు. పదోతరగతి విద్యార్థు లకు సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులను తీసుకొని విద్యా బోధన చేసి వారికి స్నాక్స్ అందజేయాలని గ్రా మస్తులను కోరారు. గతంలో ఈ పాఠశాల అభివృద్ధికి లక్ష్మారెడ్డి పనిచేశారు. ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో ఒ క్కో విద్యార్థిపై లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలను తీర్చి దిద్దిన గ్రామస్తులకు అభినందనలు తెలియజేశారు. గ్రామంలో కోటి రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఇంకా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దుతానని అ న్నారు. కాకతీయుల కాలంనాటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఉన్నా కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండడంతో అబివృద్ధి చేయలేకపోతున్నామని గ్రామ స్తులకు తెలిపారు. ఈ పురావస్తు శాఖ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో అనుమతులు లేటవుతున్నా యని అన్నారు. ఇక్కడి ఆలయాన్ని పూర్వవైవం తీసు కొస్తానని గ్రామస్తులకు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 500 కోట్ల రూపాయలతో హాస్పిటల్ మెడి కల్ కాలేజీ ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు. అద నపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మహ బూబాబాద్ జిల్లాలో 316 పాఠశాలలు మంజూరు అయ్యాయని, 44 కోట్ల రూపాయలు మంజూరు చే సిందని అన్నారు. మన ఊరు మనబడి మంచి కార్య క్రమాన్ని ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మం చిగా విద్య బోధన చేసి వారిని వృద్ధిలోకి తీసుకురా వాలన్నారు. ప్రారంభోత్సవం అనంతరం పాఠశాల ఆధునికరణలో భాగంగా ఆటస్థలం ఏర్పాటు చేసి మంత్రి వాలీబాల్ ఆట ఆడారు. అనంతరం విద్యా ర్థులలో కలిసి వేదిక వద్దే భోజనం చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్డీవో రమేష్, జిల్లా విద్యాధికారి రామా రావు, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పసు మర్తి శాంత, సర్పంచ్ వల్లపు శోభ, ఎంపీటీసీ దీకొండ కవిత, ప్రధానోపాధ్యాయులు వేణు మాధవరెడ్డి,విద్యా కమిటీ చైర్మన్ సాయిలు వైస్ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు రామ సహాయం కిషోర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సీతారాములు, కాంట్రాక్టర్ వెంకటయ్య, గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.