Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పై బైటాయించిన విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ మద్దతు
- ఉపాధ్యాయుడుని బదిలీ చేస్తూ విద్య శాఖ ఉత్తర్వులు
నవతెలంగాణ-గార్ల
తాగుబోతు ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ విద్యార్థులు రోడ్డు ఎక్కి అందో ళన చేసిన సంఘటన మండలంలోని సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జి.కృష్ణ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణ గతకొంత కాలంగా పాఠశాల కు మద్యం సేవించి వస్తున్నాడని, తరగతి గదిలో పాఠాలు కూడా సరిగ్గా చెప్పే వాడు కాదని, విద్యార్థునుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థులు ఆరోపిం చారు. పాఠశాల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పాఠశాల విద్యార్థులతో బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉండటంతో గతంలో అనేక సార్లు పాఠశాల హెచ్ లోకే ష్, మండల విద్య శాఖ అధికారుల దృష్టికి తీసుక వెళ్ళిన సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వెలిబుచ్చారు. భాధ్యత రహి తంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడు తీరులో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాఠశాల ముందు ఉన్న ప్రధాన రహదారి పై విద్యార్థులు ఎండలో దాదాపు రెండు గంటల పాటు బైటాయించి ప్లకార్డులు చేత పట్టుకుని అందోళన చేపట్టారు. విద్యా ర్థుల అందోళనతో ప్రధాన రహదారి పై ట్రాఫిక్‌కు అంతరాయం కలుగగా గ్రామం లో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులునెలకొన్నాయి.ఎస్సై బానోత్వెంకన్న అధ్వర్యంలో పోలీసులు శాంతియుతంగా అందోళన చేసేవరకు బందోబస్తుగా ఉన్నారు.
విద్యార్థుల అందోళనకు ఎస్ఎఫ్ఐ మద్దతు...
పాఠశాలలో విధులపట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ, పాఠశాలకు మద్యం సే వించి వస్తున్న ఉపాధ్యాయుడును పాఠశాల నుండి బదిలీ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేళోత్ సాయి కుమార్ డిమాండ్ చేశారు. సీతంపేట పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు క్రిష్ణను సస్పెండ్ చేయాలని విద్యార్థులు చేస్తున్న అం దోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపి రోడ్డు పై బైటాయించి అందోళన చేపట్టారు.మద్దతు తెలిపిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జి.సూర్య ప్రకాష్, ఉపేందర్, రాజేష్ తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయుడిని బదిలీ చేస్తూ తక్షణ ఉత్తర్వులు...
గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు జి.కృష్ణను బదిలీ చేయాలని విద్యార్థులు రోడ్డు పై బీష్మించి కూర్చోవడంతో ఎఇవో బి.పూల్‌చంద్ అందోళన వద్దకు చేరుకొని వి ద్యార్థులకు హమీ ఇచ్చినప్పటికీ బదిలీ ఉత్తర్వులు జారీ చేసే వరకు అందోళన కొన సాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో చేసేది ఎమి లేక సమస్యను జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళారు. విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకుల అందోళన తో స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి.రామారావు అరోపణలు ఎదుర్కొం టున్న ఉఫాధ్యాయుడు జి.కృష్ణను జిల్లాలోని మరిపెడ మండలం నిలకుర్తి ప్రాథమి క పాఠశాలకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు అందోళన విరమించుకున్నారు. ఈ అందోళనకు ఎంపిటీసి గుండె బోయిన నాగ మణి మద్దతు తెలిపారు.