Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు/వెంకటాపురం
వెంకటాపురం మండలంలో గల చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ రాజేశ్వరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టిఎల్ రవి డిమాండ్ చేశారు. చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పై విలేకర్ల సమావేశంలో వారు మాట్లా డుతూ చిరుతపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా రని, ఆశ్రమ పాఠశాల టీచర్ రాజేశ్వరి విద్యార్థులు స్నానం చేస్తుంటే వారి ఫోటో లు తీసి బెదిరించిందని ఎన్నోసార్లు విద్యార్థులు అధికారులకు తెలియజేసిన గాని ఇంతవరకు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థుల బో ధన నిర్వహించకుండా సంబంధిత టీచర్స్ పూర్తి నిర్లక్ష్యంగా వేధిస్తున్నారని, విద్యా ర్థులను పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థులకు కలవడం కోసం వచ్చిన పేరెంట్స్ పట్ల గౌరవం లేకుండా అగౌరవం గా సంబంధిత టీచర్ వ్యహరిస్తూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. అమ్మాయిలు స్నానం చేస్తున్న వైపు వెళ్ళటం అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తి న్నా సంబంధిత ప్రిన్సిపాల్ పట్టించు కోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత వై,రాజేశ్వరి టీచర్ వెంటనే సస్పెండ్ చేయాలని వారు డి మాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వ హిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవి కుమా ర్, వంశి, సిద్దు,హేమంత్ తదితరుల పాల్గొన్నారు.