Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
మహా శివరాత్రిని పురస్కరించు కొని ఈనెల 12 నుండి 21 వరకు జరిగే చండిక అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు, శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మౌత్సవా లను పాలకమండలితో పాటు అధి కారులు ప్రజాప్రతినిధులు సమన్వ యంతో కలిసి విజయవంతం చేయా లని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మౌత్స వాల సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యతో కలిసి ఆవిష్కరించారు.ఈసందర్భంగా మం త్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఈనెల 12 నుండి 16 వరకు చండిక అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 17 నుండి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మౌత్స వాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టామని తెలిపారు. బ్రహ్మౌత్సవాల్లో భాగంగా 18న జరిగే శివపార్వతుల కళ్యాణానికి నియోజకవర్గంలో పాటు ఉమ్మడి జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవం తం చేయాలని కోరారు. బ్రహ్మౌత్సవాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంతకుముందు ఆలయ పాల కమండలితో పాటు అర్చకులు మంత్రి ఎర్రబెల్లికి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు మహాశివరాత్రి బ్రహ్మౌత్స వాలకు హాజరు కావాలని ఆహ్వానాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెనుకదాసుల రామ చంద్రయ్య శర్మ, ఈవో నండూరి రజిని కుమారి, పాలకమం డలి సభ్యులు చిక్కుడు రాములు, బజ్జూరి వేణుగోపాల్, ధరా వత్ యాకూబ్ నాయక్, తీగల సత్తయ్య, ఆలయ అర్చకులు దేవగిరి రామన్న, డివిఆర్ శర్మ, ఆలయ సూపరిండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.