Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
నిరుపేద ఎస్సీ లందరికీ దళిత బంధు ఇవ్వాలని దళితబందు విధివిధానాలను ప్రకటించాలని ఎమ్మా ర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడెపాక సంజీవయ్య డిమాండ్ చేశారు శుక్రవారం జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు హాజరై మా ట్లాడుతూ... దళితబంధులో ఎమ్మెల్యేలకు పూర్తి అ ధికారం ఇవ్వడంతో అసలైన లబ్ధిదారులకు అన్యా యం జరుగుతుందన్నారు. దాన్ని గుర్తించి ఇప్పుడూ కలెక్టర్ లకు పూర్తి అధికారం ఇచ్చారని, కానీ దళిత బంధు పథకం విధి, విధానాలను ప్రకటించాలని కోరారు. ఒక్కో నియోజకవర్గం దాదాపు 30వేల నుండి 40వేల ఓటర్లు ఉంటారని, నియోజకవర్గనికి 20వేల దళితబంధు ఇవ్వాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి వర్గీకరణకు చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబుకు అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రేణుకుంట్ల మహేష్, జిల్లా కార్యదర్శి పుల్ల సతీష్ , నియోజకవర్గ ఇంచార్జి శిలపాక హరీష్, జిల్లా అధికార ప్రతినిధి మేకల ఓంకార్, టేకుమట్ల మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము, నాయకులు కల్వల సమ్మయ్య, మైస సదానందం పాల్గొన్నారు.