Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తరిగొప్పుల
మండల పరిది సోలిపూర్ గ్రామంలోని మహి ళా సంఘాల సభ్యులు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న స్త్రీనిధి రుణాలు చెల్లింపులో సీఏలు మేడిచెర్ల లింగం, మీనా అవకతవకలకు పాల్పడగా వారిని సంఘాల సభ్యులు బుధవారం ఇద్దరు సీఎ లతో పాటు, సీసీని సొసైటీ గోదాములో నిర్బందిం చారన్నారు. సీఏ మీనాపై గ్రామానికి చెందిన దండం శ్రీనివాస్ దాడి చేశాడని పోలీస్లకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు కుటుంబసభ్యుడు ఒకరు మహిళా సంఘాల సభ్యులను అసభ్యపదజాలంతో దూషిం చాడని తెలిపారు. ఆందోళనకారులతో ఎప్పె నరేష్ మాట్లాడి సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని హా మీనివ్వడంతో ఆందోళన విరమించారు. ఇరుపక్షాల వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు.