Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
నవతెలంగాణ-పాలకుర్తి
అరకొర వేతనాలతో వెట్టి చాకిరీలో మగ్గుతూ గ్రామాలను శుభ్రం చేస్తున్న గ్రామపంచాయతీ కార్మి కుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వి ఫలమయ్యాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు నిర్ణయించాలని, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 నుండి పాలకుర్తి నియోజకవర్గం లో ప్రారంభమయ్యే పాదయాత్ర వాల్ పోస్టర్ను శుక్రవారం ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధన కోసం చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పాలకుర్తి నుంచి ఈనెల 12న పాదయాత్రను ప్రారంభించుకోవడం జరుగు తుందని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటం చేస్తే ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఆశాస్త్రీయంగా జీవో నెంబర్ 51 తెచ్చిందన్నారు. జీవో 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ. 16500. కారోబార్ బిల్ కలెక్టర్లకు 19500, కంప్యూటర్ ఆపరేటర్లకు 22,750 వేతనం చెల్లించాలని, చట్టం ప్రకారం పంచాయతీ సిబ్బందిని అందరినీ పర్మినెంట్ చేసి కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించి వారిని అసిస్టెంట్ కార్యదర్శిలుగా నియమించాలన్నారు. ఉద్యోగ భద్రత, పీిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను, మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తిని వెంకన్న, గ్రామపంచాయతీ ఉద్యో గుల సంఘం రాష్ట్ర నాయకులు సమ్మయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బసవ రామచంద్రం,,గుర్రం లాజర్, గుర్రం రాజు, ప్రతాప్,తెలంగాణ రజక వత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి మదర్, మాసంపల్లి నాగయ్య, మంద సంపత్, దండంపెళ్లి సోమన్న, యాకయ్య, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.