Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలను పీఓ తనిఖీ
- వనదేవతలను దర్శించుకున్న ప్రముఖులు
నవతెలంగాణ -తాడ్వాయి
మినీ మేడారం జాతర రెండు రోజుల నుండి వైభ వంగా కన్నులపండువగా జరుగుతోంది. మూడవ రోజు శుక్రవారం కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రం నుండి కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలను పలువురు ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు. 1983లో ఏటూర్ నాగారం ఐటీడీఏ పీఓగా పనిచేసన రిటైర్డ్ ఐఎస్ అధికారి ఎంజి గోపాల్ సకుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించు కున్నారు. 1983 కాలంలో ఏజెన్సీలోని ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలు తెచ్చిన అధికారిగా మంచి గుర్తింపు పొందారు. ఏజెన్సీ అభివద్ధికి గతంలోనే పెద్ద పీట వేసి ఆదివాసులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిన ఏకైక ఐఏఎస్ అధికారిని, ఆదివాసులు, పూజారులు దగ్గరుండి దర్శనాలు చేయించారు. ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కలిసి ఎంజి గోపాల్ను సన్మానించారు. అసిస్టెంట్ గవర్నమెంట్ పిఎస్ అండ్ చీఫ్ సెక్రటరీ జి గణేష్, తెలంగాణ స్టేట్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి ఎస్ ఆర్ డి సి) చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నికల సెక్రటరీ అశోక్ కుమార్, విద్యుత్ శాఖ సిజిఆర్ఎఫ్ నెంబర్ టెక్నికల్ తిరుమలరావు, విద్యుత్ శాఖ డీఈ పులుసు నాగేశ్వరరావు, మాజీ డిఈ మహెందర్, నర్సంపేట డీఈ సదానందం, 9 మండలాల ఏఈలు విద్యుత్ సిబ్బంది కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకున్నారు. వారందరిని పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఘనంగా సన్మానించారు. అలాగే జంపన్న వాగు, ఎండోమెంట్ మంచే, బయటికి వెళ్లి మార్గాన గద్దెల వెనుక భాగాన ఉన్న మూడు తప్పిపోయిన వ్యక్తుల శిబిరాలను ఐటీడీఏపీఓ అంకిత్ సందర్శించి పరిశీలించారు. జంపన్న వాగు వద్ద సీడీపీఓ మల్లీశ్వరి ఆధ్వర్యంలో సబ్బంది పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
బయ్యక్కపేటలోనూ రద్దీ
సమ్మక పుట్టిన ఊరు బయ్యక్కపేటలో మండే మెలిగే పండుగ సందర్భంగా భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. పూజార్లు చంద గోపాల్, చందా రఘుపతి, చందా కళ్యాణ్, చందా పరమయ్య, ఆధ్వర్యంలో పూజారులు గత మూడు రోజుల నుండి సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.