Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
మాదకద్రవ్యాల వినియోగంతో పిల్లల్లో, యువతలో అనేక అనర్ధాలు కనిపిస్తున్నాయని, మాదకద్రవ్యాల వినియోగాన్ని, దాని అక్రమ రవాణాను నిరోధించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో పిల్లల్లో డ్రగ్స్, మాధక దవ్యాల వినియోగము, అక్రమ రవాణా నిరోధం పై జిల్లాలో జాయింట్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ పైన పోలీస్ శాఖ విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, సోషల్ వెల్ఫేర్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో ఆయన సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశంలో ప్రఫుల్ దేశారు మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా వినియోగం పై వివిధ శాఖల బాధ్యతలను వివరించారు. అందులో భాగంగా షెడ్యూల్ ఎక్స్, హెచ్ మందులను విక్రయించే మెడికల్ షాపుల్లో ప్రధానంగా సిసి టీవీ కెమెరాల ఏర్పాటు, మందుల వివరాలు అన్నింటిని ఆన్లైన్లో నమోదు చేయాలని, అలాగే 18 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రమాదకరమైన మందులు విక్రయించరాదని హెచ్చరించారు. మాదకద్రవ్యాల తీసుకోవడం వల్ల కలిగేటువంటి అనర్థాలను వివరించి, దానివల్ల కలిగే అనర్థాలను, దుష్ఫలితాలను పిల్లలకు వివరించి అవగాహన కలిగించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైతే స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండరాదని, జిల్లా స్థాయిలో ఎక్సైజ్ శాఖ సర్కులర్లు జారీ చేయాలని, పాఠశాలలు కళాశాల సమీపంలో ఉన్న మద్యం షాపులపై సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారు. చైల్డ్ వెల్ఫేర్, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలల్లో చుట్టుపక్కల మద్యం పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి కోర్నెలియస్, బాలల పరిరక్షణ అధికారి రవికాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ఉప్పలయ్య, జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ బాలకష్ణ, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ అధికారి విష్ణు ప్రియ, సెక్టోరియల్ ఆఫీసర్ నరసింహారావు, డాక్టర్ అశోక్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.