Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
విభజన హామిల అమలుకు సిపిఐ నేతృత్వంలో మార్చి 17వ తేదీ నుండి మహబూబాబాద్ జిల్లా బయ్యారం నుండి భారీ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం హన్మకొండ సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాద యాత్రలో 500 మందితో ఎర్రదండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర ఏప్రిల్ 17న హైద్రాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ముగు స్తుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ పాదయాత్రలో భాగంగా ఆరు చోట్ల బహిరంగసభలను నిర్వహించనున్నామన్నారు. బయ్యారంలో ప్రారంభ మయ్యే పాదయాత్ర మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. వరంగల్ ఇస్లామియా కాలేజీ మైదానంలో జరిగే బహిరంగసభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, హన్మకొండలో కెడిసి మైదానంలో జరిగే బహిరంగసభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరుకానున్నారని తెలిపారు. పాదయాత్రలో ముఖ్యంగా గడిచిన తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో జరిగిన నిర్లక్ష్యం, 2014 నుండి విభజన హామిలను అమలు చేయకుండా కేంద్రం చేస్తున్న నిర్లక్ష్య వైఖ రిని ఎండగట్టడం జరుగుతుందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంతోపాటు సాగునీటి ప్రాజె క్టులు, వరంగల్ టెక్స్టైల్స్ పరిశ్రమకు నిధులు కేటాయించలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూ పోరాటాలు ఉధృతంగా సాగుతున్నాయన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ నిలిపివేయాలని, సింగరేణి ఆధ్వర్యంలోనే మైనింగ్ జరపాలన్నారు. జనగామ నుండి హైద్రాబాద్ వరకు ఇండిస్టియల్ కారిడార్ ఏర్పాటు డిమాండ్‌ను పాదయాత్ర ద్వారా ప్రభుత్వం ముందుంచుతామన్నారు. విభజన హామిలపై స్థానిక బిజెపి నేతలు స్పందించాలన్నారు. ఈ పాదయాత్రను, బహిరంగసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల కార్యదర్శులు మేకల రవి, కర్రె బిక్షపతి, బి. విజయసారధి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.