Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గ స్థానాలలో పొంగు లేటి సైన్యా న్ని గెలిపించడమే ఎజెండాగా పని చేస్తామని ఖమ్మం మాజీ ఎంపి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో మాజీ ఎంపి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ లు శుక్రవారం విస్తతంగా పర్యటించారు.మర్రిగూడెం సమిపంలో ఉన్న శ్రీ వేట వేం కటేశ్వరస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిక్లితం డాకు చెందిన భూక్య రమేష్ అనేఆర్మీ జవాన్ ఇటివల ప్రమాదంలో మరణించగా రమేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రమే ష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.రాజు తండా కు చెందిన రాందాస్ కుమారుడు వివాహం ఇటివల జరగగా నూతన దంపతు లను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందించారు.మూడ్ తండా కు చెందిన జె. రాజు ఇటివల మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.సరిహద్దు తండాలో అనారోగ్యంతో బాధపడుతున్న వద్ధురాలు ను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మర్రిగూడెం గ్రా మంలో భూక్య కాంతారావు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనెటీ విందు లో పాల్గొని ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం మండల కేంద్రం లోని నెహ్రూ సెంటర్ లో ఏర్పాటు చేసిన పొంగులేటి, కోరంకనకయ్యల క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను ఏ పార్టీ లో చేరుతానో త్వరలోనే ప్రకటిస్తానని ప్రస్తుతం జెం డాలు ఏదైనా ఎజెండా మాత్రం పది నియోజకవర్గ వర్గాల్లో తన అనుచరులను గెలిపించడమే ఎజెండాగా పనిచేస్తామని స్పష్టంచేశారు. అందుకు ప్రజాప్రతి నిధు లు, అనుచరులు,అభిమానులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో జడ్పీటీసి జాటోత్ ఝాన్సీలక్ష్మీ, మూడ్శివాజీ చౌహాన్, గుం డా వెంకటరెడ్డి, భూక్య నాగేశ్వరరావు, యాకూబ్ పాష, ఎ.వెంకటేశ్వర్లు, బి.రవి, బి.రాంసింగ్, వీరేందర్, బి.అశోక్, శ్రీనివాసరెడ్డి, పి.నారాయణ తదితరులు ఉన్నారు.