Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
పోడు సాగుభూములన్నింటికీ ప్రభుత్వం పట్టా లు వెంటనే ఇవ్వాలని అఖిల భారత రైతుకూలీ సం ఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు అన్నా రు. మండల కేంద్రంలోని వేజెళ్ల సైదులురావు భవ న్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మండ రాజన్న అధ్యక్షతన ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ జాయింట్ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అడవులు ఆ ప్రాంతాల్లోని భూగర్భ వనరులు కార్పొరేట్లకు ధా రాదత్తం చేయటానికి ఆది వాసీలు, ఇతర అటవీ ని వాసులను గెంటి వేయడా నికి కేంద్రంలోని మోడీ స ర్కార్, అటవీ సంరక్షణ ని యమాలు 2022 పేరిట 2022 జూన్ 28న అప్ర కటిత యుద్ధాన్ని ప్రకటిం చిందన్నారు. జనవరి 31 నుండిజరిగిన పార్లమెం టు బడ్జెట్ సమావేశాల్లో త న మందబలంతో ఆమోదించబోతున్నదని తెలిపారు. నూతన సవరణ నియమాలు అటవీ హక్కుల చట్టం 2006 దాని నియమాలు ఆదివాసుల హక్కులకు సంబంధించిన పీసా, తదితర చట్టాలను ఉల్లంఘిస్తా యన్నారు. వీటి అమలను ఆపమని కోరుతూ జాతీ య షెడ్యూల్డ్ తెగల కమిషన్ ది 2022 సెప్టెంబర్ 26న కేంద్ర ప్రభుత్వానికి వివరంగా ఒక లేఖ రాసిం దని, కమిషన్ లేవనెత్తిన ఉల్లంఘనలకు జవాబు కేంద్రం ఇవ్వకుండా దాటవేసి కార్పొరేట్ అనుకూల స వరణలు సమర్ధిస్తుందన్నారు.
ఆదివాసులు తదితర అటవీ నివాసుల సుదీర్ఘ కాల పోరాటాల ఫలితంగా శతాబ్దాలుగా జరిగిన చా రిత్రక అన్యాయాన్ని సవరిస్తూ అటవీ హక్కుల చట్టం 2006 వచ్చిందని చెప్పారు. ఈ చట్టం వచ్చిన దగ్గర నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం చట్టాలను తుంగలో తొక్కి ఆదివాసులు, త దితర అటవీనివాసులు గత నాలుగు, మూడు దశా బ్దాలుగా సాగు చేసుకుంటూ తమ జీవితాలను కొన సాగిస్తున్న వారిని భూముల నుండి గ్రామాల నుండి గెంటి వేయడం అన్యాయమని అన్నారు. కార్పొరేట్ సంస్థలలాభాల కోసం ఆదివాసీల హక్కులు కాలరా సే నూతన అటవీ సంరక్షణ నియమాలను వ్యతిరేకి స్తూ మండల, జిల్లా కేంద్రాలలో జరుగు ధర్నాలను, నిరసనర్యాలీలను జయప్రదం చేయాలని ఆదివాసు లను అటవీ నివాసులను కోరారు. రాష్ట్రంలో పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని అటవీ సంరక్ష ణ నియమాలు 2022ను కేంద్ర ప్రభుత్వం ఉపసం హరించుకోవాలని, అటవీసంరక్షణ నియమాలు 20 02 ఉపసంహరించాలని కేంద్ర, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ జాయింట్ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బిల్లకంటి సూర్యం, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.