Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
గూడూరు మండలం మట్టెవాడ గ్రా మ పంచాయతీలోని దొరవారి తిమ్మా పురం గ్రామాన్ని ఖాళీ చేయాలని ఫారె స్టు, రెవెన్యూ అధికారులు వత్తిడి చేయ టం అమానుషమని వందేళ్లుగా అక్కడ జీవిస్తున్న వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరి కీ లేదని సీపీఐ (ఏంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని న్యూడె మోక్రసీ కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఆయన మా ట్లా డుతూ దొరవారి తిమ్మాపురం గ్రామానికి రహదారి సౌకర్యంతో సహా ఎలాంటి క నీస సౌకర్యాలు లేవని,75 ఏళ్ళ స్వాతంత్య్య్ర పాలనలో కనీస అభివద్ధికి నోచుకోని ఆదివాసీ గ్రామంగా మిగిలిందని అన్నారు. ఆదివాసీల రక్షణకు,అభివద్దికి వున్న రాజ్యాంగ రక్షణలను,చట్టాలను తుంగలో తొక్కి వారికి నిలువ నీడ లేకుండా చే యటానికి చేసే కుట్రలను విడనాడాలని ప్రభుత్వాన్ని , అధికారులను హెచ్చ రించారు. ప్రభుత్వ కుట్రలపై ఆదివాసీ ప్రజాప్రతినిధులు మౌనం వీడాలని అన్నా రు. ఇప్పటికైనా తిమ్మాపురం గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పి0చి ఆగ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.బలవంతంగా ఖాళీ చేయించ డానికి ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తామ న్నారు. మనుషుల బాగోగులను పట్టిం చుకోని మన ప్రభుత్వాలు అడవి జంతు వులరక్షణ గురించి ఆలోచించటం వి డ్డూరంగా ఉందన్నారు.
టైగర్‌జోన్ పేరుతో ఆదివాసీలను బజారున పడేసే దుర్మార్గపు చర్యలను ప్ర జలంతా ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ (ఏంఎల్) న్యూడె మోక్రసీ జిల్లా నాయకులు బూర్క వెంకటయ్య,పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆగబోయిన నర్సక్క,మాజీ ఎంపీటీసీ వజ్జ సమ్మక్క,ఏఐకేఏంఎస్ జిల్లా సహాయ కా ర్యదర్శి యాదగిరి యుగంధర్, మాజీ ఎంపీటీసీ గజ్జి సోమయ్య,పార్టీ నాయకులు పిట్టల దేవేందర్, గట్టి సురేందర్, కల్తీ వెంకన్న , జిట్టబోయిన రామచంద్రు, ఈసం నాగేశ్వర్రావు, నాయకులు పూర్ణ చందర్,పసునూటి రాజమల్లు,గొగ్గెల రాంబాబు, ఈసం జగ్గారావు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.