Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్య పోరాట వేక పిలుపులో భాగంగా మండల మరిపెడ కేంద్రం లోని తహశీల్దార్ ఆఫీస్ ముందు సీఐటీ యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహశీ ల్దార్కు పలు డిమాం డ్లతో కూడిన వినతి పత్రాన్ని శుక్రవారం అందించారు. ఈ సం దర్భంగా సీఐటీయూ మండల కో కన్వీనర్ కాగిత రాంబాబు మాట్లా డుతూ ఎన్నికల ముందు ఇల్లులేని వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇళ్ల స్థలం ఉండి ఇల్లుకట్టుకోలేని స్తోమత లేనివారం దరికీ ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తా మని చెప్పి 8 ఏళ్లు దాటినా కూడా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని అన్నా రు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. ఉపాధి లేక కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నిత్యవసర సరుకులపై అధిక ధరలు పెంచి పేద ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. పెంచిన నిత్యవసర ధరలు తగ్గిం చాలన్నారు. ఉపాధిహామీతోనైనా కార్మికులకు పని దొరుకు తుందంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కోతవిధించడం బాధాకరమని ,ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు .ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్య క్షులు కొండ ఉ ప్పలయ్య, మల్సూర్, బొడ్డు వెంకన్న, గంజి శ్రీను, బానోత్ వీరన్న, వాసు, వెంకన్న సుంకరి వెంకన్న, శ్రీ రాములు, సైదులు, జాంమూర్తిలు పాల్గొన్నారు.