Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ సింగారపు కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
వ్యాపారస్తులు తమ తమ దుకాణా లైసెన్స్ ఫీజు లు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమి షనర్ సింగారపు కుమార్ అన్నారు. శుక్రవారం తొ ర్రూర్లో ఉన్నటువంటి దుకాణదారులు తమ లైసెన్స్ ఫీజులను మీ సేవ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకో వాలని లేనియెడల దుకాణాలను సీజ్ చేయబడతా యని అన్నారు. టీచర్స్ కాలనీలోని బజాజ్ షోరూం సందర్శించి లైసెన్స్ ఆన్లైన్లో నమోదు చేసు కొనని యెడల 25 రెట్లు జరిమా నా విధించబడు తుందని తెలిపారు. తమ లైసెన్సు లను రెన్యువల్ విషయం లో ఏమైనా సమస్యలు ఉ న్నచో మున్సిపల్ కార్యాల యంలో సంప్రదించాలని కోరారు. అనంతరం కంటేపాలెం రోడ్డులోని హౌస్ పర్మిషన్ సందర్శించడం జరిగింది. ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిర్మాణం చేపట్టాలని, ఫ్రంట్ సైడ్ 1.5 మీటర్స్ సెట్‌బ్యాక్, చుట్టూ కూడా వన్ మీటర్ వదిలిపెట్టి నిర్మాణం చేసుకోవాలన్నారు. సిం గిల్యూస్ ప్లాస్టిక్‌ను ప్రతి ఒక్కరూ నిషేధించాలని, అటవీ మంత్రిత్వ శాఖ ఉత్తర్ల ప్రకారం 120 మైక్రాన్స్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు అనగా ప్లాస్టిక్ ఇయర్‌బర్డ్స్,. ప్లాస్టిక్ జెండాలు. ప్లాస్టిక్ క్యాం డీ స్టిక్స్. ప్లాస్టిక్ థర్మాకోల్. ప్లాస్టిక్ స్పూన్లు , ప్లాస్టిక్ ప్లేట్స్గ్లాసులు. ప్లాస్టిక్ స్ట్రాలు. ప్రజలు వుడెన్ ఇయ ర్ బర్డ్స్, క్లాత్ జెండాలు, ఫ్యాబ్రిక్ బ్యానర్లు, పేపర్ స్వీట్ బాక్స్ లు వినియోగించాలని అన్నారు. ఇవి ఎవరైనా నిల్వచేసిన, ఎగుమతి, దిగుమతి చేసిన రూపాయలు వెయ్యి నుండి 25 వేల రూపాయల వ రకు జరిమానా విధించబడుతుందని అన్నారు. ప్లాస్టి క్ మీద మున్సిపాలిటీ నుండి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని ఎవరైతే ప్లాస్టిక్ వినియోగి స్తున్నారో వారి షాపులకు జరిమానా విధించి వారి షాపును సీజ్ చేయబడుతుందని కమిషనర్ కుమార్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజు, జూ నియర్ అసిస్టెంట్ శ్రావణ్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేం దర్, బిల్‌కలెక్టర్ వెంకట్రామనరసయ్య, మహేం దర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.