Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసంహరించాలని బీఎల్ఎఫ్ డిమాండ్ - విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ధర్నా
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ శాఖ విద్యుత్ బిల్లు లో ఏసీడీ పేరుతో అదనపు భారం మోపుతోందని, తక్షణమే ఎసిడి చార్జీలను ఉపసంహరించుకోవాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ జిల్లా కన్వీనర్ నీల రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మం డలంలోని ప్రగతి సింగారం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేష న్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ప్రజలపై విద్యుత్తు ఎసిడి చార్జీలు ఏప్రిల్ నుండి యూనిట్‌కు 30 పైసల నుంచి ఆపై ప్రతి నెలనెలా పెంచుటకు విద్యుత్తు డిస్కంలకు విచ్చలవిడిగా అ నుమతులు ఇవ్వటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందజేస్తామని ఉదరకొట్టి, దేశంలో అధికారంలోకివస్తే ఉచితవిద్యుత్ అందించేందుకు బీఆర్ఎస్ కృషి చేస్తుందని చెబుతూ, ఆచరణలో మాత్రం వివిధ రకాల పేరుతో చార్జీల భారాన్ని మోపడం సిగ్గుచేటనీ అన్నారు. 2015నుంచి డిస్కౌంట్ లో ఉన్న లోటు రూ.16,110 కోట్లభారం వేయుటకు ఇస్తున్న అనుమతుల ను ఈఆర్సి వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు.ఈ కార్యక్రమం లో బిఎల్ఎఫ్ నాయకులు పరికరాల భూమయ్య, కూసం బుచ్చయ్య,చిలుకల రాజన్న, చిలకల కొమరయ్య, గాజు కొ మురయ్య, గాదం సమ్మయ్య, చిలుకల మల్లయ్య, రవి, సదయ్య పాల్గొన్నారు.
కాశిబుగ్గ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజ లపై వేసిన విద్యుత్ చార్జీల భారాన్ని వెం టనే ఉపసంహరించుకోవాలని ఎంసీపీ ఐ(యు) వరంగల్ నగర కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భా గంగా శుక్రవారం ఎంసిపిఐ(యు) ప్రతినిధి బందం కాశిబు గ్గ సర్కిల్ కార్యాలయంలో డిఈ మల్లికార్జున్ ను కలిసి విన తిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా నాగార్జున మాట్లా డుతూ దేశంలో నిరంతరం విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం తెలం గాణ అని గొప్పగా చెబుతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పై విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతూ గత టిడిపి ప్రభుత్వ మాదిరిగా తెలంగాణలో పాలన కొనసాగిస్తుందని మండి పడ్డారు. ఇప్పటికే పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు, పన్నుల వసూలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై విద్యుత్ చార్జీలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజలు తిరుగుబాటు చేయకముందే రాష్ట్ర ప్రభు త్వం ఏసిడి చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇలాంటి విద్యుత్ చార్జీల పెంపు ఆలోచన చేస్తే పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమీకరణ చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంసి పిఐ (యు) నాయకులు సుంచు జగదీశ్వర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.