Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-శాయంపేట
పేదలు ఉన్నచోటే ఎర్రజెండా రెపరెపలాడు తుందని, ఎర్ర జెండాతోనే నిరుపేదల కష్టాలు నెరవే రుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దకోడపాక రెవెన్యూశివారులోని సర్వే నెంబర్ 633 ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రదేశంలో ఏర్పాటుచేసిన సీపీఐ పార్టీ జెండాను ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లులేని పేదలందరూ ప్రభు త్వ భూమిలో సిపిఐ ఆధ్వర్యం లోగుడిసెలు వేసుకు న్నారని వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నారు. నిరు పేదలు గుడిసెలు వేసుకొని 30 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇం డ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి,కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లుప్రజలకు ఇచ్చిన హామీలను అమ లు చేయకుండా ప్రజల నోట్లో మట్టికొడు తున్నారని విమర్శించారు. పేదలకు పంచడానికి భూ మి ఉండదని, భూ కబ్జాదా రులు ప్రభుత్వ భూమిని ఆ క్రమించుకొని పట్టాలు చే యించుకోవడానికి భూము లు ఉంటాయా అని ప్రశ్నిం చారు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్ష లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ముందుండి ఉద్యమిస్తామన్నారు. బేషరతుగా ప్రభు త్వం ఇండ్లుమంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భార త కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే 10వేల మందికి గుడిసెలు ఉండడానికి ఇండ్లస్థలాలు ఇప్పించిందని, వారి అభివృద్ధి, శ్రేయ స్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జి ల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి, సహాయ కార్యదర్శి తోట బిక్షపతి, మహబూబాబాద్ కార్యదర్శి విజయసారథి, మండల నాయకులు బత్తిని సదానందం, అనుకారి అశోక్, అరికిల్ల దేవయ్య అనిల్ కుమార్, సంతోష్, రాజుగౌడ్, రాజేందర్, అశోక్, సదానందం, మారేపల్లి క్రాంతికుమార్, మనోజ్, బుజ్జన్న, చింతల భాస్కర్, దామర కొండ కొమురయ్య, సుమన్, దేవయ్య తది తరులు పాల్గొన్నారు.