Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
దేశంలోని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇ స్తామని చెప్పిన బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాల కల్పన భూటకమే అని భారత ప్రజా తంత్రయువజన సమైక్య హనుమకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి విమర్శిం చారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య హన్మకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ చివరి బడ్జెట్లో నిరుద్యోగ యువతకు అసలు ప్రాధాన్యత లేదని, నిరుద్యోగం, ధర ల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం అనేకం ఉన్నాయ నారు. మొత్తం బడ్జెట్ ప్ర సంగంలో నిరుద్యోగం అనే పదాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని, గతంలో ప్రభుత్వం చేసిన నెరవేర్చని వాగ్దానాల రికార్డును పరిశీలిస్తే అలాంటి హామీలు ఖాళీ ప్రకటనలు మాత్రమే అని, దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై దష్టి సారించకుండా బడ్జెట్ ద్వారా ఏమి ప్రకటించబడలేదని, ఉపాధి హామీ పథకా న్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుంద అన్నారు ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని, యువత డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం విరుద్ధంగావ్యవహరిస్తోందని, తెలిపారు.దేశంలోని విద్యార్థులకు నాణ్య మైన సార్వత్రిక విద్యను అందించాలి అని గత సంవత్సరాల్లో, విద్యపై బడ్జెట్ కేటా యింపులు ఆశించిన దానికంటే తక్కువగానే ఉన్నాయ న్నారు.సామాన్య ప్రజల ప్రాథమిక సమస్యలైన నిరుద్యోగం,ధరల పెరుగుదల, గురించి ప్రస్తావనలేదని, పేదలను మరింత పేదలుగా మార్చే కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని డివైఎఫ్ఐ యువతకు పిలుపునిస్తుందని బడ్జెట్ లో నిరుద్యోగ యువతకు అసలు ప్రాధాన్యత లేదని,క్రీడలఅభివృద్ధికి,స్కిల్ డెవలప్మెంట్కి నిధులు కేటాయించక పోవడం దారుణమని, బీజేపీ హామీ ఇచ్చిన ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన భూటకమే అని వచ్చే ఎన్నికలలో నిరుద్యోగ యువత బీజేపీని గద్దె దించడం ఖా యమని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ఉపాధ్యక్షులు మంద సుచందర్, సుమలత, జిల్లా సహాయ కార్యదర్శులు మంద సురేష్ వల్లేపు లక్ష్మణ్, చిట్యాల విజరు కుమార్, ఓర్సు చిరంజీవి, కమిటీ సభ్యులు కుర్ర హర్ష, మాటూరి సతీష్, నాగరాజు, రాజు, జంపయ్య, అశోక్, లు పాల్గొన్నారు.