Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు జీ.నాగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీ య గ్రామీణ ఉపాధిహామీ పథకానికి, సంక్షేమ రం గానికి భారీగాకోతలు విధించడం దుర్మార్గమని తెలం గాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ. నాగయ్య అన్నారు. శుక్రవారం సంఘం కార్యాలయం లో ఈదునూరి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన వ్య కాస జిల్లా కమిటీ సమావేశంలో నాగయ్య ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదలకు వ్యతిరేకమైంద న్నారు. 2023 బడ్జెట్ సామాన్య ప్రజల పాలిట శా పంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పై బీజేపీకి ఎంతటి కక్షపూరితమో మరో మారు తెలి యజెప్పిందన్నారు. కిందటి బడ్జెట్లో ఉపాధి హామీకి రూ.89వేల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 60వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులు పుకుందన్నారు. 40శాతం నిధులను కోత విధించ డంతో దేశంలోని 15 కోట్ల కుటుంబాల జీవన ప్రమా ణాలపై తీవ్రప్రభావం చూ పు తుందన్నారు. తెలంగా ణ రాష్ట్రంలో 55లక్షల జా బ్కార్డులు కలిగిన కూలీల కు ఉపాధి లేకుండా చేసిం దన్నారు. రాబోయే రోజు ల్లో ఉపాధి పనులు దొరక్క పొట్ట కూటి కోసం పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు సంక్షేమ రంగా నికి పూర్తిగా కోతలు విధించి పేదలకు ఆహార భద్రత లేకుండా లేకుండా చేసిందని తెలిపారు. ఆహార భద్ర తచట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి నిత్యవసర సరుకు లను పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాని దేన్నారు. గతఏడాది బడ్జెట్లో రూ.2, 88,194 లక్ష ల కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్లో రూ.1,77, 350 కోట్లు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేసిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ఫుడ్ సబ్సిడీ రూ.2,68,321 కోట్లు కేటాయించగా ఈ బడ్జెడ్లో రూ.ఒక లక్ష 75 వేలకు కోట్లకు కుదించేసిందన్నారు.
రైతు,కూలీల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏ పాటి చిత్తశుద్ధి రుజువు చేసిందని విమర్శించారు. రోజంటికీ ఉపాధి రంగం కుదేలవుతున్న తరణంలో బడ్జెట్లో కేటాయింపులు చేసి ఆదుకోవాల్సిన కేంద్రం కోత విధుస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బడా సంపన్నులకు మాత్రం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి మరింత సంపన్నులుగా చేసేందకు తీ వ్ర ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. మోడీ ప్ర భుత్వంలో పేద, సామాన్యుల జీవనం దినదిన గం డంగా మారగా కార్పొరేట్ శక్తుల ఆస్తులు రెట్టింపు స్థా యిలో పెరిగేలా తోడ్పడిందన్నారు. మరో వైపు యువ తకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొరవడిపోతుంద న్నారు. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్ని కల్లో ఓట్లను కొల్లగొట్టి యువతకు తీరని ద్రోహం చే సిందని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు చేపట్టనుందని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుండి 18వ తేదీ వర కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా నగరంలో ని ర్వహించనున్న సంఘం అఖిల భారత మహాసభలు నిర్వహిస్తుందన్నారు. ఈ మహా సభల్లో దేశంలో వ్యవ సాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామ న్నారు. మహా సభలను వ్యవసాయ కార్మికులు జయ ప్రదం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం వ రంగల్ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య జిల్లా అధ్య క్షులు నమ్మిండ్ల స్వామి, చింతమల్ల రంగయ్య, బోళ్ల సాంబయ్య, మొగులూరు శారద, ఇస్లావత్ రవి, పు చ్చకాయల నరసింహారెడ్డి, బసికే మొగిలి, గుగులోతు బిక్షపతి, కవిత, ఐలయ్య, శివ పాల్గొన్నారు.