Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
ఉద్యమాల గడ్డ భూపాలపల్లి అడ్డా అని కేసులకు భయపడేది లేదని, భూములను వదులుకోమని, అధైర్య పడొద్దు ఆందోళన చెందవద్దని, పేదల అండ గా ఎర్రజెండా ఉంటుందని, పట్టాలు అందే వరకు పోరాటం ఆగదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువు సర్వే నంబర్ 280, 283, 284, 285లో సుమారు 24 ఎకరాల శిఖం భూమిలో 8 రోజులుగా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో గుడిసెలు వేశారు. సుమారు 1500 పైగా గుడ ిసెలు వెలిశాయి. శుక్రవారం ఏర్పాటు చేసిన గుడిసె వాసుల సమావేశానికి బందు సాయిలు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గెలిచి ఎనిమిది సంవత్స రాలు కావస్తున్నా ఇప్పటివరకు భూపాలపల్లి నియోజ కవర్గంలో ఏ ఒక్క పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని అన్నారు. జీవో 58 ద్వారా పేదలకు భూములు ఇచ్చి రూ.5లక్షలు ఇంటి నిర్మాణం కోసం ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని మరో మార్గం లేక భూ పోరాటం నిర్వహించి పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. స్థలం మనకు దక్కే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ, రాజీవ్ నగర్, శాంతినగర్, సుభాష్ కాలనీలలో 25 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న పేద ప్రజలకు వారికి కరెంటు, రోడ్లు మంచినీరు ఇచ్చేంతవరకు వారికి అండగా సీపీఐ(ఎం) నిలిచిందన్నారు. బూర్జవ పార్టీలు మాయమాటలతో గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయన ఆరోపించారు. జీఓ 58 ప్రకారం 120 గజాల్లోపు ఉన్న ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని సూచించారు. పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలను తీవ్రతం చేస్తామని హెచ్చరిం చారు. 9న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపడతామన్నారు. గుడిసె వాసులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కంపేటి రాజన్న, చెన్నూరి రమేష్, పొలం రాజేందర్, దమేర కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు డబ్బా రాజన్న, అతుకురి శ్రీకాంత్, పొలం చిన్న రాజేందర్ , సకినాల మల్లయ్య , గుర్రం దేవందర్ పార్టీ నాయకులు బొడ్డు కిషోర్ ,బొడ్డు స్మరన్ , రిత్విక్ ,విజరు ,మహేందర్, సంపత్, రాజు పాటు గుడిసె వాసులు పాల్గొన్నారు.