Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
ఈ నెల 6న రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో సమ్మక్క సారలమ్మ సాక్షిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తలపెట్టిన హత్ సే హత్ పాదయాత్ర ములుగు నియోజక వర్గం లోని తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల నుండి ప్రారంభమవుతుందని వజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నాయకులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని క్యాంపు కార్యాలయంలో ములుగు మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా అధ్యక్షతన నిర్వహిం చిన ములుగు, వెంకటాపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ, పం డించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామ న్నారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, పోడు భూము లకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుం టుందని అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి పాద యాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టిపిసిసి సభ్యులు మల్లాడి రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి పాల్గొన్నారు.
గోవిందరావుపేట : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్రను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ ప్రజల అస్థిత్వాన్ని కాపాడడానికి, హాత్ సే హాత్ జోడో యాత్ర చేపడుతున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని, తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ పటేల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సీతారాం నాయక్, సహకార సంఘం అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, , పాలడుగు వెంకటకష్ణ, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఫిబ్రవరి 6 నుండి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధి నుండి ప్రారంభం అవుతుందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ సంపత్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బొల్లు విజయ దేవేందర్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్ సునీల్ దొర అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పాదయాత్ర రెండు నెలలపాటు జరుగుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు పాల్గొని పాదయాత్ర ప్రారంభి స్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం పస్రా లో భారీ బహిరంగ సభ ఉంటుందని, అనం తరం పాదయాత్ర మొదలవుతుందని అన్నారు. పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్గౌడ్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, పిఎసిఎస్ డైరెక్టర్లు యానాల సిద్ది రెడ్డి, రంగరబోయిన జగన్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వావిలాల రాంబాబు, మాజీ సర్పంచ్లు బెజ్జూరి శ్రీనివాస్, నరసయ్య, పాల్గొన్నారు.