Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో విడత గొర్ల పంపిణీ కాకుండా నగదు బదిలీ చేయాలని గొర్ల మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్) జిల్లా అధ్యక్షుడు చేపూరి ఓదెలు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సంద ర్భంగా ఓదెలు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమల అభివద్ధి చేయాలనే లక్ష్యంతో మొదటి విడుత గొర్ల పంపిణీ చేసినప్పటికీ దళారులు పశు వైద్యాధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోగా గొల్ల కురుమలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత గొర్ల పంపిణీ కాకుండా గొర్లకు బదులు నగదు బదిలీ చేయాలని, గొర్ల మేకల కాపరులు మతి చెందితే రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, గొర్లు మేకలకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్‌బాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొర్రె అనిల్, జిల్లా నాయకులు అక్కల బాబు, సకినాల మల్లయ్య, కొమురయ్య బుర్రి కుమారస్వామి ,ఒగ్గు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఉడుత మల్లయ్య, మండల నాయకులు జునువాల వివేక్ ,తొట్ల మహేష్, సంగ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
నర్మెట : గొర్రెలకు బదులు నగదు బదిలీ చెయ్యాలని జీఎం పీఎస్ జిల్లా అధ్యక్షులు మోటే దేవేందర్, జిల్లా కార్యదర్శి సాదం రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జీఎంపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి తహసీల్ధార్‌కు వినతపత్రం అందజేశారు. సంఘం మండల గౌరవ అధ్యక్షులు నక్కల గట్టయ్య.కాసు కనుకయ్య, ముక్కెర మహేందర్, పులిగిల్ల సీద్దయ్య, శ్రీపతి కుమార్, పులిగిల్ల రాజు, శ్రీపతి మల్లయ్య, తుప్పుర్ నాగరాజు, మార్క వెంకటేష్, ముడిక గట్టుమల్లు, అప్పల కుమార్, మార్క వెంకన్న పాల్గొన్నారు.
జఫర్గడ్ : రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గొర్లకు బదులుగా నగదు బదిలీ ఇవ్వాలని జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎక్కల రాజవీరయ్య, మండల అధ్యక్షులు కుక్కల రాజు అన్నారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సొసైటీ ఉపాధ్యక్షులు కుమారస్వామి, మండల కార్యదర్శి జిల్లెల్ల రవీందర్, నక్క శ్రీను, మంచాల ఐలయ్య, కుంచాల అనిల్, తదితరులు పాల్గొన్నారు.