Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిలో ఎండు గంజాయి స్వాధీనం..
రిమాండ్కు తరలింపు
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గంజాయి రవాణాదారులు ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి కిలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూపాలపల్లి ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణం లోని 5ఇంక్లెన్ కమాన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపడుతుండగా ఒకే ద్విచక్ర వాహనంపై గణపురం మండలంలోని బొబ్బిలోనిపల్లి గ్రాహకి చెందిన నేరేళ్ల ప్రవీణ్, పట్టణంలోని కష్ణకాలనీకి చెందిన మహ్మద్ షాకీర్, జవహర్ నగర్ కాలనీకి చెందిన అటుకాపురం రాకేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనుమానస్పందంగా కనిపించారన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నిషేదిత కిలో ఎం డు గంజాయి లభ్యమైందన్నారు. అయితే, గత కొంతకాలంగా చత్తీసుడ్కు చెందిన చాందిని అనే వ్యక్తి నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. భూపాలపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లుగా ఒప్పుకున్నారన్నారు. ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు వెల్లడించారు. కాగా, ఎవరైనా గంజాయి అమ్మినా, సేవించినా డయల్-100కు గానీ, 8712658110 నెం బర్కు ఫోన్ చేసి వెంటనే సమాచారం అందించాలని సీఐ రాజిరెడ్డి కోరారు.