Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్ర శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఉదయం కేటీకే - 6 ఇంక్లైన్లో ఐఎన్టీయూసీ సింగరేణి కార్మికులతో నిర్వహించిన గేట్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొని, సింగరేణి కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను వివరించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్నా అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో గాంధీనగర్, ఎల్బి నగర్, బానోత్ వీధి, లక్ష్మీ నగర్, శాంతినగర్, హనుమాన్ నగర్ వరకు కొనసాగింది. పలు కాలనీలల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటా తిరుగుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలు, స్థానిక ఎమ్మెల్యే హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలు అమలు చేయడంలో విఫలమైం దన్నారు. బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని కోరారు. టీపీసీసీ సభ్యులు చల్లూరి మధు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెంపటి భువనసుందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రెసిడెంట్ భట్టు శ్రీలత - కరుణాకర్, ఐ ఎన్ టి యు సి నాయకులు జోగ బుచ్చయ్య, బుర్ర కొమురయ్య, పసునూటి రాజేందర్, వేణుగోపాల్, కౌన్సిలర్ దాట్ల శ్రీను, పృధ్వీ, చుంచుల మహేశ్, పిప్పాల రాజేందర్, అంబాల శ్రీనివాస్, పొనకంటి శ్రీనివాస్, మదూకర్ రెడ్డి, బౌతు రాజేశ్ పాల్గొన్నారు.