Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాసా రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసు కున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బిరెడ్డి సాంబశివ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజాసం ఘాల పిలుపుమేరకు శుక్రవారం మండల కేంద్రంలో గుడిసవాసులకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుండి డప్పు చప్పుల్లతో స్థానిక తహసీల్ధార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి తహసీల్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వ హించారు. ఈసందర్భంగా బిరెడ్డి సాంబశివ మా ట్లాడుతూ... పస్రా పరిధి శివారు సర్వేనెంబర్-109లోని ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. గుడిసె వాసులకు కనీస అవసరాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గుడిసెవాసులకు రూ.5లక్షలతో పక్కా ఇండ్లు నిర్మించవ్వాలన్నారు. నేటి నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి గుడిసెలు వేసు కున్న పేదలందరికీ హక్కుపత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే పేదలు, వ్యవసాయ కూలీలను ఐక్యం చేసి ప్రభుత్వాన్ని గద్ద దించే వరకు దశలవారి పోరాటాలను ఉదతం చేస్తామని హెచ్చరించారు. కాగా ధర్నాకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శ తుమ్మల వెంకట రెడ్డి సంఘీభావం తెలిపారు. రైతు సంఘం నాయకుడు తీగల ఆగిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పొదిళ్ల చిట్టిబాబు, ప్రజా సంఘాల నాయకులు అంబాల పోషాలు, కడారి నాగరాజు, గుండు రామస్వామి జటబైన రమేష్, పల్లపు రాజు, కందుల రాజేశ్వరి, సరిత, సువర్ణ, సకినాల రాజేశ్వరి, పాయం శారద, అంబల మురళి, అరుణ, రాంబాబు పాల్గొన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ లను వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు సీహెచ్ రంగయ్య, సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాల యం ఎదుట ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో సీఐ టీయూ జిల్లా అధ్యక్షుడు సాగర్ అధ్యక్షతన మహ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ప్రజా సంఘా లు సీఐటీయూ, ఐద్వా, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆవాజ్, పీఎన్ఎం సంఘాల నాయకులు, కార్యక ర్తలు పాల్గొని నినాదాలు చేశారు. 58 జిఓ ప్రకారం అర్హులైన పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇల్లు కట్టి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, 100 గజాల లోపు జాగ ఉన్న వాళ్ళకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ఏండ్ల తర బడి కార్మికులు, పేదలు ఇండ్ల కిరాయి కట్టలేక చాలి చాలని వేతనాలతో దుర్భర జీవితాలు గడు పుతున్నారన్నారు. వారు ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారన్నారు. రెండు పడక గదుల ఇండ్ల కోసం వేలాది మంది దర ఖాస్తు చేసుకున్నా ఎవరికీ ఇండ్లు అందివ్వడం లేదన్నారు. వరంగల్ నగరంలో నూతనంగా వేసు కున్న గుడిసెలలో మౌలిక వసతులు కల్పించేం దుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రవికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అస ిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి నలిగంటి రత్నమాల, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మ్మూర్తి, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండి బషీర్, పీఎన్ఎం జిల్లా కార్యదర్శి దుర్గయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారీ సింగారపు బాబు, సీఐటీయూ జిల్లా నాయకులు శ్రీనివాస్, పాషా, ఐద్వా జిల్లా నాయకులు భవాని, ప్రత్యూష, పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలి
ములుగు : ములుగు మండల వ్యాప్తంగా చాలామంది నిరుపేదలు ఇంటి స్థలాలు, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు, డబుల్ బెడ్ రూంలు ఇవ్వా లని ఏఐకేఎస్, డీవైఎఫ్, సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ములుగు తహ శీల్దార్ కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ తాహా సిల్దార్ చంద్రశేఖర్‌కు శుక్రవారం వినతిపత్రం అం దించారు. ఈ సందర్బంగా రైతుసంఘం జిల్లా ఉపాద్యక్షులు యండి అమ్జద్ పాషా, రైతు సంఘం జిల్లా కార్యదర్శి యండి గఫూర్ పాషా, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోడ రమేష్, డీ వైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లా డారు. గత ప్రభుత్వాలు పేదల కోసం ఇంటి స్థ లాలు కేటాయించి పంచిన ఇండ్ల స్థలాలను మళ్లీ ఇప్పటి ప్రభుత్వం అభివద్ధి పేరుతో ప్రభుత్వ కా ర్యాలయాల నిర్మాణం పేరుతో లాక్కోవడం హే యమైన చర్య అన్నారు. ములుగు ప్రాంతంలో డబుల్ బెడ్ రూములు పూర్తి స్థాయిలో నిర్మించ డంలో నిర్లక్ష్యం నెలకొందన్నారు. మండలంలో ఉన్న నిరుపేద ప్రజలకు ఇల్లు స్థలాలు, ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పురుషోత్తం తిరుపతి రాజేశ్వరి, రాదమ్మ, నగేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పజా సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి : ప్రజా సమస్యలు పరిష్కరిం చాలని సీఐటీయూ జిల్లా నాj ుకులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రజా సంఘాల పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని తహస ిల్దార్ కార్యాల యం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ... నిలువ నీడలేని నిరుపేదలు, కార్మికులు, రైతులు వ్యవ సాయ కార్మికులు, మహిళలు, ఆదివాసీలు యువ జనులు, విద్యార్థులు ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ అన్ని కులాల పేదలు ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు గూడు కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాల న్నారు. భూపాలపల్లి పట్టణంలో అద్దెకు నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల స్థలాలకి ఇవ్వాలని, భూ పాలపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇల్లు లేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ ఎండి ఇక్బాల్‌కు అందించారు. సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు, కాంపేటి రాజయ్య, చెన్నూరి రమేష్, టీఏజీఎస్ అధ్యక్ష కార్యదర్శులు పొలం రాజేందర్ ,సూదుల శంకర్, ఇల్లు లేని నిరుపేదలు, రైతులు ,వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలు యువకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.