Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యేక సమావేశం కోసం అదనపు కలెక్టర్కు వినతి
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ పై మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని ప్రకటించారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్కు చెందిన 11మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్కు చెందిన 8మంది కౌన్సిలర్లు అదనపు కలెక్టర్ కు ఇచ్చిన నోటీస్ పై సంతకాలు చేశారు. కౌన్సిలర్లు బండ పద్మ, నాగరాజు, కే.శ్రీనివాస్, దయాకర్, పాక రమ, అరవింద రెడ్డి, జూకంటి లక్ష్మి, పేర్ని స్వరూప, ఎం.చంద్రకళ, నీల శ్రీజ, అనిత, గాదపాక రామచంద్రం, గంగరబోయిన మల్లేశం, ముస్తాల చందర్, రామగళ్ళ అరుణ, వంగాల కళ్యాణి, మోతే కమలమ్మ, మంత్రి సుమలత, జక్కుల అనితలు అవిశ్వాసం ప్రకటించిన వారిలో ఉన్నారు. గత నెల 25 నుండి అధికార పార్టీ కౌన్సిలర్లు అసమ్మతి జెండా ఎగురవేసి ఇప్పటి వరకు క్యాంపులో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల నుండి కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కోసం కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పలు కారణాలతో సాధ్యపడలేదు. పార్టీ అధిష్టానం కూడా కౌన్సిలర్లను సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా అసమ్మతికి అధికార పార్టీ కౌన్సిలర్లతో కలిసి రావడంతో తగిన సంఖ్యాబలం సమకూరినట్లైంది. జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ ల భవిష్యత్తు త్వరలో పెట్టబోయే మున్సిపాలిటీ ప్రత్యేక సమావేశంలో తేలనుంది.