Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ములుగు
తైౖక్వాండో శిక్షణ తరగతులను ములుగు సీఐ రంజిత్ కుమార్ ప్రారంభిం చారు. జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ పక్కన నూతన భవనంలో శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఐదు సంవత్సరాలకు పైగా ఎస్ఎంఎ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ తను గుల అనిల్ యాదవ్ పర్యవేక్షణలో టైక్వాం డో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం ద్వారా పిల్లలు శారీరక, మానసికంగా ఆరోగ్యం ఉంటారన్నారు. 40 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తైౖక్వాండో మాస్టర్ అనిల్ యాదవ్ మాట్లా డుతూ శిక్షణ పోటీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం వల్ల ఉన్నత చదువులు ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్ఎంఎ తైౖక్వాండో అసోసి యేషన్ ద్వారా ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ రెడ్డి, జర్నలిస్ట్ సిహెచ్.రాజువర్ధన్ పోస్టాఫీస్ సమ్మయ్య, తైక్వాండో మాస్టర్ వంశీ,జన్ను విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.