Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
గూడూరు మండలంలోని దొరవారి తిమ్మాపూర్ గ్రామాన్ని ఎక్కడికి తరలించొద్దని ఆదార్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ డిఈ మెట్ల పాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం దొరవారి తిమ్మాపురం గ్రామాన్ని సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు కావాలని అడిగితే ఊరు మొత్తం ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం సిగ్గుచేటని అన్నారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన దొరవారి తిమ్మాపురం గ్రామ అమాయక ఆదివాసి అడవి బిడ్డల్ని రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి వెంటనే ఇలాంటి కుటిల ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో అన్ని ఆదివాసి గుడాలలో మాలిదశ తిరుగుబాటు తప్పదన్నారు. ఆయన వెంటఏఈడబ్ల్యూసిఏ రాష్ట్ర నాయకులు బుగ్గ రామనాథం, ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి, ఏఈడబ్లుసిఏ నాయకులు వట్టం సాయిలు, సువర్ణపాక సమ్మయ్య, పూనెం రాంచందర్, పెనుక లక్ష్మయ్య, రమేష్, అర్రెమ్ వీరస్వామి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.