Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై శ్రామిక వర్గం రైతాంగం ఐక్యంగా పోరాడాలని సిపిఎం మహబూబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు మండ రాజన్న పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నంబూరి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజన్న మాట్లాడుతూ... కేంద్ర బడ్జెట్ దేశంలోని పేద ప్రజల పై, రైతాంగం, శ్రామిక వర్గం, చిన్న ఉత్పత్తిదారుల పై దాడి చేసిందని, ఉపాధి హామీకి భారీ కోత విధించిందని, ఆహార సబ్సిడీ ఎరువుల సబ్సిడీ భీమా నీటిపారుదల వ్యవసాయం కార్మికులు అన్ని ఇతర సామాజిక వర్గాలకు కేటాయింపుల్లో భారీ కోతలు పెట్టడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీ బయ్యారంకు ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. పతికి గిట్టుబాటు ధర కల్పించాలని సీజన్ ప్రారంభంలో 9800 ఉండగా దళారుల మోసం వల్ల 7000 లోపే అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. పోడు భూముల సమస్యలు, ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 9 న హైదరాబాదులో ఇంద్ర పార్క్ వద్ద మహాధర్న ఉంటుందని ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు తోడుసు యాదగిరి, యాకుబ్, వల్లాల వెంకన్న, చంటి, శ్రీను, ఆనందరావు పాల్గొన్నారు.