Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
పలిమెల మండల కేంద్రానికి చెందిన గుత్తికోయ గూడెంలో కమ్యునిటీ కాంటాక్ట్ లో భాగంగా ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గూడెంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వకూడదని అన్నారు. మావోయిస్టులు ప్రభుత్వ విధానాలకు, ప్రజా జీవనానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చినా, సహాయం చేసినా చట్ట పరంగా చర్యలు ఉంటాయని తెలిపారు.