Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్
నవతెలంగాణ- ములుగు
ఎన్ని యాత్రలు చేసినా... ఏన్ని దండాలు పెట్టినా జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మిమ్ములను నమ్మే స్థితులలో లేరని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరికా గోవింద్ నాయక్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా లో సోమవారం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారల మ్మ జాతర నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన జొడో యాత్ర ఎందుకోసం చేస్తున్నారో జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలతో సమానంగా కలిపి అంతకన్నా ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే ములుగు జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్వరాష్ట్రంలో గిరిజన ప్రాంతామైన జిల్లాకి గిరిజన యూనివర్సిటీ మంజూరు అయితే, గిరిజన యూనివర్సిటీ కోసం కాంగ్రెస్ ఎంపీ అయి ఉండి పార్లమెంటులో మాట్లాడారా అని ప్రశ్నించారు. నేడు రేవంత్ ములుగు జిల్లా నుండి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. గిరిజన యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి తరగతులను ప్రారంభించండంటే అనేక రకాల కార్యక్రమాలు చేసిన పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు ఈ పాదయాత్ర ఎందుకని ఎద్దేవా చేశారు. ములుగు ప్రజలు అన్ని గమనించాలని అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని పార్లమెంట్ లో ఏనాడైనా రేవంత్ ప్రశ్నించాడా అని అన్నారు. పాదయాత్రను భద్రాచలం నుండి ప్రారంభిస్తామని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నారని, ఇందులో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలు బయట పడతాయని గ్రహించి,ఇ ప్పుడు జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారని అన్నారు. రాబోయే కాంగ్రెస్కు తగిన గుణ పాఠం చెబుతామని అన్నారు.