Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్ రావు
నవతెలంగాణ -తొర్రూర్ రూరల్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచా యతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని వెలికట్ట గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏళ్ళ క్రితం చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహిం చారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అంతకుముందు పూర్వ విద్యార్థులు ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే జ్యోతిబాపూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అకాలంగా మృతి చెందిన స్నేహితులకు సంతాపం తెలిపారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యా యుడు సోమారపు ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...పూర్వ విద్యార్థులు ఏళ్ల అనంతరం ఒక్కచోట చేరి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం అభినందనీయ మన్నారు. పూర్వ విద్యార్థుల చొరవతో రాష్ట్రంలోని అనేక పాఠశాలలు ప్రగతి పథంలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నామని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి రూ.7,289 కోట్ల నిధుల్ని కేటాయిం చామని తెలిపారు. శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల ఏర్పాటు, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేసి ప్రభుత్వ విద్యా విధానం రూపురేఖలే మారనున్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటర్ కాలేజీలను 1050 పెంచినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం ప్రత్యేకంగా 53 డిగ్రీ గురుకుల కళాశాలలను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రూ. కోటి వరకు పాఠశాలలకు విరాళమిస్తే పాఠశాలలకు వారి పేర్లను పెట్టడం జరుగుతుందన్నారు.వెలికట్టలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్డీవో రమేష్, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, సర్పంచ్ పోసాని పుష్పలీల సంతోష్,ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ, ఉప సర్పంచ్ దీకొండ యాకన్న,రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చందా మల్లయ్య, హెచ్ఎంలు శ్రీను బాబు, ఉమాదేవి, డీఎస్పీ గుజ్జ రమేష్, స్థానికులు పోసాని రాములు బత్తుల యాకయ్య, రాజేశ్వరి, దొడ్డ విజయ్, బాబు,వెంకన్న గౌడ్,మాలోతు రెడ్యా నాయక్, పాకనాటి మోహన్ రెడ్డి, ధీకొండ సమ్మయ్య, యాక లక్ష్మి శంకరయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి నిరంతర కృషి
పాలకుర్తి నియోజకవర్గం లోని దేవాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని నాంచారి మడూరు గ్రామానికి చెందిన కోడూరు నరసింహ రెడ్డి సహకారంతో సుమారు 2 కోట్ల 50 లక్షల నిధులతో చేపడుతున్న పురాతన కాలం నాటి శివాలయం వేణుగోపాల స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈనెల 22,23,24 తేదీలలో జరుపుకునే ఉత్సవాల్లో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు తొర్రూరు ఆర్డీవో రమేష్, జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ, పిఏ సిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, స్థానిక సర్పంచ్ గుంటుక యాదలక్ష్మి యాకయ్య, ఎంపిటిసి కుంభం సుకన్య రెడ్డి, ఉప సర్పంచ్ నల్లమాస వెంకటేశ్వర్లు,ప్రధాన అర్చకులు డివిఆర్ శర్మ గౌతమ్ శర్మ పాల్గొన్నారు.