Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో గళమెత్తిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, మాజీమంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. శనివారం జరిగిన శాసన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరో పించారు. కరెంటు కోతలు అధికంగా ఉన్నాయని, నిరుద్యోగ భృతి ఏమైందని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని ప్రశ్నించారు. వైద్య విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.కాలేశ్వరం వల్ల కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందో చెప్పాలన్నారు.మంథని నియోజకవర్గంలో పోతారం, దామరకుంట, వల్లెంకుంట వద్ద లిఫ్ట్ లను ఏర్పాటు చేసి, చిన్న కాలేశ్వరంను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులకు జీతాలు టైం కు రావడం లేవు, డీఏ లు లేవు, పిఆర్సి లేదని, సీపీఎస్ రద్దు లేదు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.రాష్ట్రవ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారన, కానీ ఆ కొనుగోలు కేంద్రంలో రైతులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తున్నారన్నారు. క్వింటాలుకు 8 కేజీల చొప్పున పక్కన పెడుతు దోచుకుంటున్నారని తెలిపారు. భూపాలపల్లి పెద్దపెల్లి జిల్లాలకు సంబంధింన చైర్మన్ తో పలుమార్లు మాట్లాడడం జరిగిందన, కరెంట్ కోతలతో రైతులకు గురివుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26లక్షల మంది నిరు ద్యోగులకు ఎప్పుడు నిరుద్యోగభతి ఇస్తారో తెలపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పక్కన పెట్టడంతో అనేకమంది పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏమైందని అన్నారు. 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కాలేశ్వరం అతిపెద్ద ప్రాజెక్టు అని, కానీ ఎవరికి ఉపయోగపడుతుందోసమాధానం చెప్పాలన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టిన ప్రాంతంలో స్థానిక రైతులకు మేలు జరిగిందా లేదా ఒకసారి సర్వే చేపించాలని కోరారు. నాలుగు సంవత్సరాల నుండి పదే పదే పోతారం, దామరకుంట వద్ద లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వల్లెంకుంట పలిమెల,కుదురుపల్లి నాగరం, కుట్లం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బడ్జెట్ సాంక్షన్ చేసి ఇవ్వాలన్నారు. సర్పంచ్ల నిధుల్లో స్పష్టత లేదని, సర్పంచుల అంశం విష యంలో నిధులు లేకుండా, తమ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఉందన్నారు.