Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
ప్రతి ఒక్క కుటుంబ కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఆర్థికంగా ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నీరుకుళ్ళ గ్రామంలో ఇటువల గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు ఉడుత ప్రభాకర్ తల్లి సారమ్మ అనా రోగ్యంతో మృతి చెందగా ఇనగాల ఆదేశాల మేరకు నీరుకుళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సమ్మాలు కుటుంబాన్ని పరామర్శించి ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించారు. మాజీ సర్పంచ్ ఉడుత మహేందర్ సంగీత,పాక్స్ డైరెక్టర్ ఉడత రాజేందర్, మాజీ అధ్యక్షులు ఎన్నపరెడ్డి నాగరాజు,అర్షం విక్రమ్ గాంధీ, రవి శ్యామ్, రాజు,కీత రాజు, ఆటో యూనియన్ అధ్యక్షులు ఉడత శ్రీనివాస్, మండల మైనార్టీ విభాగం అధ్యక్షులు యం.డి.రఫీ పాల్గొన్నారు.
ఇనగాల ఆశీర్వచానాలు
మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ,మండల ప్రధాన కార్యదర్శి కాయిత బిక్షపతి- రాజేశ్వరి దంపతుల పుత్రిక అవిల శారీ ఫంక్షన్కు ఆదివారం ఇనగాల వెంకటరామిరెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదింఆచరు. గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య,జిల్లా నాయకులూ చాడ కొమురరెడ్డి, జిల్లా ఎస్సి సెల్ వైస్ చైర్మైన్ ధూపాకి సంతోష్,15వ డివిజన్ అధ్యక్షులు ఎలగొండ ప్రవీణ్,కొమ్ము శ్రీకాంత్, కర్ణాకర్, సిటీ నాయకులూ ఓ.రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇనగాల ను కలసిన కాంగ్రెస్ నాయకలు
పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హన్మకొండ లోని ఆయన నివాసంలో గీసుగొండ మండలం సింగే తండా గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. రమేష్, రాఘవేంద్ర ,వీరన్న, నరేష్,రమేష్, రాజన్న,తిరుపతి, రాజేశ్వరరావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.