Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్(గీసుగొండ)
జాతీయ రాజకీయాల్లో బిజెపి కి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.ఆదివారం గీసుగొండ మండల నాయ కులు రడం భరత్ ఆధ్వర్యంలో గీసుగొండ, మనుగొండ, ఏలుకుర్తి, గట్టుకింది పల్లి, రాంపూర్, మచ్చాపూర్, గొర్రెకుంట గ్రామాల నుండి 200 మంది ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,రాష్ట్ర ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువతకు పెద్దపీట వేస్తామని యువకులు ఉరిమే ఉత్సా హంతో పార్టీ అభివృద్ధికి కష్టపడాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారాని అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. పార్టీలో చేరినవారిలో మంద బాబు, సరోజ,సారవ్వ,లక్ష్మి,సుజాత, బాబు,గొర్రె ప్రభాకర్,దయాకర్,జన్ను రమేష్,నమిండ్ల మామయ్య,గొర్రె రాజు,మంద రాంబాబు,గుండేటి సమ్మయ్య,మామిండ్ల స్వామీ, కుమారస్వామి, ఆంద్రయ్య, గట్టయ్య, యాకయ్య,రాజు,పులి కోర్నెలు,సుజాత,రజిత,అన్నమ్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పోలీస్ ధర్మారావు,నాయకులు రడం భరత్,అల్లం మర్రెడ్డి,సర్పంచులు గొనె మల్లారెడ్డి,గాజర్ల గోపి,డొలే చిన్ని,మామిండ్ల రాజు,నాయకులు మామిండ్ల మానయ్య,కోట ప్రమోద్,జూలూరి లెనిన్ తదితరులు పాల్గొన్నారు.