Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతురి
బడా పెట్టుబడిదారుల కోసమే కేంద్ర బడ్జెట్ ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు. మండల కేంద్రంలో రెండవ రోజు కొనసాగుతున్న సీపీఐ శాఖ కార్యదర్శిల రాజకీయ శిక్షణ తరగతులకు ఆదవారం హేమంతరావు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇండ్ల పట్టాలు మంజూరు చేసి ఇండ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ల పొత్తులపై తాము ఇప్పటివరకు ఆలోచించలేదని అయినా ఎన్నికల పొత్తులు వేరు ప్రజా ఉద్యమాలు వేరని అన్నారు. బిజెపిని నిలువరించడంలో భాగంగానే, గతంలో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. బిజెపిపై తమ శాశ్వత అవిశ్రాంత పోరాటం కొనసా గుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన..బడ్జెట్లో. తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను విస్మరించారని అన్నారు. రైతులు, పేద గ్రామీణ కూలీలు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం గురించి కూడా కేంద్రం తీరు సరిగ్గా లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి జమ లెక్కలపై స్పష్టత లేదని అన్నారు.. అసంఘటిత కార్మిక వర్గానికి సంక్షేమ పథకాల తదితర వాటిని విస్మరించారన్నారు. వివిధ రకాల పన్నులు, జీఎస్టి తదితరవి మధ్యతరగతి వర్గాలకు పెనుభారంగా మారాయన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరు కుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. ఈ బడ్జెట్తో పేదలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. శిక్షణా తరగతులలో మానవ సమాజ పరిణామ క్రమంపై నేదునూరు రాజమౌళి, భారతదేశ స్వతంత్ర పోరాటం సిపిఐ పార్టీ పాత్రపై జితేందర్ రెడ్డి బోధించారు. జిల్లా కార్యదర్శి కర్ర బిక్షపతి , శిక్షణ క్లాసులకు ప్రిన్సిపల్ గా ఆదర్ శ్రీనివాస్ , కార్యదర్శిగా మధ్యల ఏల్లేష్ వ్యవహరించారు. మండల కార్యదర్శి ఉట్కూరి రాములు, కర్రే లక్ష్మణ్, మునగాల బిక్షపతి, మంచాల రమాదేవి, మర్రి శ్రీనివాస్, తామర వెంకటరమణ, శంకర్, మనోహర్,తదితరులు పాల్గొన్నారు.