Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
నవతెలంగాణ-జనగామ
గిరిజన బాలుర కళాశా ల హాస్టల్ విద్యార్థుల సమ స్యలను వెంటనే పరిష్కరిం చాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ స భ్యులు అజ్మీర సురేష్ నా యక్ డిమాండ్ చేశారు.తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్మకంచలోని గిరిజన బాలుర కళాశాల హాస్టల్‌ను సందర్శించారు. అలాగే గిరిజన సంఘం హా స్టల్లో కమిటీనీ వేశారు. అనేక విషయాలు విద్యార్థుల్లోతో చర్చించి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడంలేదన్నారు.బాత్రూమ్స్ శుభ్రత లేదు, బాత్రూం కు సరిగా డోర్లు కూడా లేక ఫ్యాన్లు లైట్స్ అనేక సమస్యలతో విద్యార్థులు సతమ తమవుతున్నారన్నారు.డిటిడిఓ ఐటిడిఏ అధికారులు వెంటనే స్పందించి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా నాయకులు తేజావత్ గణేష్ నాయక్ , రాంప్రసాద్, నరేష్, అజ్మీర భరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.