Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఐఎఫ్టీయూ సంఘం కార్మికులు డిమాండ్ చేశారు. కేసముద్రం మార్కెట్ యార్డులో యూని యన్ అధ్యక్షులు రావాడ శ్రీను అధ్య క్షతన జరిగిన సమావేశంలో శివారపు శ్రీధర్ మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు అనుబంధ మిల్ డ్రైవర్స్ యూనియన్ కార్మికులు వేతనాల పెంపు కోరుతూ సుమారు రెండు నెల లుగా రెండు దఫాలుగా నోటీసులు ఇచ్చినప్పటికీయాజమాన్యాల వైపు నుండి ఎలాంటి స్పందన లేనందున ఫిబ్రవరి ఒకటి నుండి కార్మికులంతా సమ్మెలో ఉన్నా రని ఈసమ్మె ఆరు రోజులుగా కొనసాగుతుందని,కార్మికులకు పెరుగుతున్న నిత్య వసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన అవసరం ఉం దని ఇప్పుడిస్తున్నటువంటి జీతాలతో కార్మికుల కుటుంబాలు గడవడం కష్టంగా ఉందని వెంటనే యాజమాన్యాలు స్పందించి కార్మికులతో చర్చలు జరిపి సమ్మెను విరమింప చేయించాలని యాజమాన్యాలు పట్టింపులకు పోయి కార్మికుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి విడనాడాలని అన్నారు. ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించిపారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పారిశ్రామిక శాంతి కొనసాగేలా చూడవలసినటువంటి బాధ్యత యాజమాన్యాలపైనే ఉందని వార న్నారు.ఈ కార్యక్రమంలో బొల్లోజు వెంకన్న, ఎస్కే రహిమాన్, ఎండి అబీబ్, అల్లరి ఎల్లయ్య, కొంగరి రమేష్, ఎస్ కే యాకూబ్ పాషా, కొంగరి నవీన్, దారాత్ రవి, ఎండి రఫీ, తీగల వెంకన్న, పోతుల శేఖర్, ఎన్నమాల మహేష్ , గాజగోని వీరన్న ధరావత్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.