Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
నిరుపేదల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ప్రభు త్వం కేటాయించాలని సిఐటి యు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురా లు ఇర్రి అహల్యలు డిమాం డ్ చేశారు. సోమవారం సిఐటియు 5వ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట ఇల్లు లేని నిరుపేదలు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడి న వినతి పత్రాన్ని తాసిల్దార్కు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ మున్సిపల్ పరిధిలో గల ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్వంత స్థలములో ఇంటి నిర్మాణము చేసుకునే కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్ర భుత్వం వెంటనే మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాలలో ఇండ్ల నిర్మాణం కొరకు. రూ. 5 లక్షల రూపాయల కొరకు బడ్జెట్ వెంట నే మంజూరి చేసి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. జనగామ పట్టడం రోజురోజుకు విస్తరిస్తుందని తద్వారా కుటుంబాలు పెరిగి వేలాది రూపాయలు ఇంటి అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. పట్టణంలో నివాసం ఉంటున్న నిరుపేదలకు ఉపాధి దొరకక ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి కుటుంబ పోషణ భారంగా మారిం దన్నారు. కావున జనగామ మున్సిపల్ పరిధిలో ఉన్న దరఖాస్తు చేసుకున్న ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇళ్లస్థలం కేటాయించి వారిని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ సుంచు విజేంద ర్, ఐద్వా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చీర రజిత, సిఐటియు జిల్లా కమిటీ సభ్యు లు వడ్డేపల్లి బ్లెస్సింగ్ టన్, ఐద్వా పట్టణ కార్యదర్శి కొండ వరలక్ష్మి, సిఐటియు టౌన్ కమిటీ సభ్యులు గంగరబోయిన మల్లేష్ రాజ్, నాయకులు కచ్ఛ గళ్ళ వెంక టేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పందిళ్ళ కల్యాణి గౌసియా జ్యోతి రజిత నాజి యా తదితరులు పాల్గొన్నారు.