Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సుమారు మూడు లక్షల కో ట్ల బడ్జెట్ అంకెల గారడీగానే ఉందని సిపిఐ (ఎం ఎల్) ప్రజాపందా తొర్రూరు డివిజన్ కార్యదర్శి కొత్త పల్లి రవి అన్నారు. స్థానిక కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ప్రాధాన్యతా రంగాలను విస్మరించి నామమాత్ర పు కేటాయింపులతో జబ్బులు చరుచుకున్న చందం గా ఉందని ఎద్దేవా చేశారు.రాష్ట్ర రైతాంగానికి ముఖ్య మైన రుణమాఫీకి తగిన కేటాయింపులు లేవని, నిరు ద్యోగ భృతి, ఉద్యోగ కల్పన ఊసే లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి వేరే వాటికి ఖర్చు చేయడం చట్ట విరుద్ధం అని ఆరోపించారు. గిరిజన బంధు, బీసీ బందు ఊసే లేదని అనేక పెం డింగ్ ప్రాజెక్టులకు చాలీచాలని నిధులు కేటాయించా రని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే గత సంవ త్సరం కేటాయింపులు పరిశీలిస్తే నేటి కేటాయింపు లను కోతల బడ్జెట్‌గా చూడవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. గత వార్షిక బడ్జెట్లో కేటాయింపులు కనీసం 70 శాతం కూడా విడుదల కాలేదని అవే అంకెలు కలిపి నేడు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు చదివా రని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ తెగ ఊదరగొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ల సంగతి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన అబివృద్ధికి చేసిన కేటాయింపులు ఏవి అని ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ రైతు ఆత్మహత్యలు, పంటల బోనస్, మార్కెట్లో సమస్యలు, విద్యార్థుల మె స్ చార్జీలు,ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు విస్మరించా రని ఆయన ప్రశ్నించారు.ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జె ట్ను ప్రజలు తిరస్కరించాలని సిపిఐ (ఎంఎల్) ప్రజా పంథా పిలుపునిస్తుందని రవి తెలిపారు. ఈ కార్యక్ర మంలో తోరూర్ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న, డివిజన్ నాయకులు బండపల్లి వెంకటేశ్వర్లు, పల్లెల పాపారావు, తణుకు పిడిఎస్యూ జిల్లా కార్య దర్శి భూక్య సంతోష్, రమేష్ పాల్గొన్నారు.