Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఆర్వోకు వినతి
నవతెలంగాణ-రఘునాథపల్లి
మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం అన్నారు. సోమవారం రోజున మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్వో అన్వర్‌కి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ధర్మభిక్షం మాట్లాడుతూ మండలంలోని ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్‌కు సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు అలాగే ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు టాయిలెట్ రూమ్స్ త్రాగునీరు మరుగు దొడ్లు ఫ్యాన్స్ లైట్స్ గ్రౌండ్ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అన్నా రు. అలాగే సంక్షేమ హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగు ణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాల ర్షిప్స్ ఫీజు రియంబర్స్ మెంటును వెంటనే విడుదల చేయాలి అన్నారు. ఇంటర్మీ డియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రవేశ పెట్టాలన్నారు. అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్స్ దగ్గర షి టీమ్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మండలంలోని ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించ కుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేటు విద్య సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే చదువుకునే విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు ఇవ్వాలి అన్నారు. ఈ సమస్యలపై స్పందించి వెంటనే పరి ష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు అలాగే మన ఊరు మన బడి కార్యక్ర మంలో పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పొదల లవ కుమార్, అధ్యక్షుడు వంశీ అజిత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.