Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
ఉపాధి హామీ పనులను గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా నిర్వహించాలని అమ్మాపురం సర్పంచ్ కడెం యాకయ్య, ఎంపీటీసీ-1 డోనుక ఉప్పలయ్యలు అ న్నారు. సోమవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పను లను సర్పంచ్ యాకయ్య, ఎంపీటీసీ ఉప్పలయ్యల చేతుల మీదుగా కొబ్బరికాయ లు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ కార్డు కలిగి ఉన్న కూలీలకు చేతినిండా పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లి, ఉపాధి హామీ పథకాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచుతూ పనుల్లో నాణ్యతకు చర్యలు తీసుకోవాలని, రాబోయేది ఎండాకాలం దృష్ట్యా కూలీలకు ఎండ తీవ్రత నుండి ఉపశమనం కొరకు మంచినీరు, మజ్జిక కల్పించి, ఓఅర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గూడెల్లియాకయ్య, ఉపాధి కూలీలు మార్క దేవేంద్ర, కిన్నెర సుశీల, రేణుక, లక్ష్మయ్య, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.