Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
సిఐటియు అధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన పోరా టాల ఫలితంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచిందని సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ అన్నారు. స్దానిక మంగపతి రావు భవనంలో సోమవారం నారగోని రేణుకా అధ్యక్షతన జరిగిన మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణం గా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో చేప ట్టిన పోరాటాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 3 వేల రూపాయల వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 8ను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్మికులు వేతనాల పెంచాలని ఎన్నో దఫాలుగా ఎంఈవో, డిఈవో కార్యాలయా ల ముందు ధర్నాలతోపాటు ఛలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రకటించిన వేతనాలు పెంపు తక్షణమే అమలు చేయాలని సియం కేసీఆర్ ను కోరారు. ఈ నెల 8న జిల్లా కేంద్రంలో జరిగే మిడ్ డే మీల్స్ వర్కర్స్ విస్తత స్థాయి సమావేశానికి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికులు పద్మ, నాగమణి, అనసూయా, విజయ, పద్మ, సావిత్రి, రమా దేవి, అలివేలు, కళమ్మ, సరిత, నాగమణి ,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.