Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
మండల కేంద్రంలో సోమవారం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భం గా మండల కమిటీ సభ్యులు వడ్లకొండ సుధాకర్, గుండెబోయిన రాజు మాట్లా డుతూ కరెంటు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది రైతులకు తెలియడం లేదు అన్నారు. విషయం పై విద్యుత్ అధికారులను అడిగిన తమకేం తెలియనట్టు నిర్ల క్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మాత్రం 24 గంటలు కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ ఆ పరిస్థితి గ్రామాల్లో లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన త్రీ ఫేస్ విద్యుత్తును రైతులకు పగటిపూట నిరంతరాయంగా షిఫ్టు లేకుండా ఒకేసారి ఇవ్వాలన్నారు. విద్యుత్ లైన్ల కింద చెట్లు పెరిగి లైన్లకు తగులుతూ ట్రాన్స్‌ఫారంలో ఫీజులు తరచుగా పోతున్నాయి అన్నారు. ఓవర్ లోడ్ ఉన్న ప్రదేశాల్లో అదనంగా ట్రాన్స్ఫార్మర్ను బిగించి ఓవర్ లోడ్‌ను నియంత్రించాలన్నారు. లేనిపక్షంలో రైతు లందరికీ సమీకరించి దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్ర మంలో వేల్పుల చిన్న రాములు, పెద్ద రాములు యాదవ్, నక్క యాకయ్య, ఎండి షబానా, రోజ, గంగరాజు, ఎర్ర రవి, శాంతం సమ్మయ్య, ఆర్ రజిత, లక్ష్మి, రోజా, తదితరులు పాల్గొన్నారు.