Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగారం
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా లు వెంటనే ఇవ్వాలని సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా గం గారం కొత్తగూడెం మండలాల కార్యదర్శి పూనం ప్రభాకర్ సోమవారం నాడు డిమాండ్ చేశారు.ఆదివాసి పోడు వన సంరక్షణ సమితి పోరాట వేదిక పిలుపులో భాగంగా గంగారం ఎమ్మార్వో ఆఫీస్లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీ వేసుకొని పోడు రైతులకు పట్టాలు ఇస్తానని చేసిన వాగ్దానం ఏమైందని ఆయన ప్రశ్నించారు. మంత్రుల సబ్ కమిటీ ముఖ్యమంత్రి హామీలు నీటి మీద రాతలని అని ఎద్దేవా చేశారు. పోడు భూముల కు పట్టాలు ఇవ్వకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వన సంరక్షణ సమితి చట్టం 2022 సవరణ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఏజెన్సీ ప్రజలను మరింత దుర్భర దారిద్రునికి గురి చేస్తుందని అన్నా రు.కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆది వాసి గిరిజన వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించు కోకపోతే ప్రతిఘటన తప్పదు ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ల్యాదల్ల రాజు,రైతు సంఘం నాయకులు రామారావు, వెంకటయ్య పొట్టయ్య, నాగేశ్వరరావు, సతీష్ పాల్గొన్నారు.