Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట సేవాలాల్ సేన నిరాహార దీక్ష
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
సేవాలాల్ జయంతిని గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని, కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సేవాలాల్ సేన ఆధ్వర్యంలో స్థానిక కల ెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సిపిఎం, కాంగ్రెస్, బిజెపి తది తర రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. సిపిఎం జిల్లా కార్య దర్శి మోకు కనకారెడ్డి ముందుగా దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. సేవా లాల్ జయంతి ఉత్సవాలకు ప్రతి జిల్లాకు పది లక్షల రూపాయలు కేటాయించా లని, గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం ఎస్టి కమిషన్ ఏర్పాటు చేయాలని, గిరిజనులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు అందివ్వాలని, గిరిజన బంధును ప్రకటిస్తూ జీవోను విడుదల చేయాలని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి శిబిరానికి వచ్చి మద్ద తు ప్రకటించారు. బిజెపి జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి మద్దతు ప్రకటిం చి దీక్షలను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షు లు ధరావత్ శంకర్ నాయక్, ఉపాధ్యక్షులు భుక్ష రాజు నాయక్, భానోతు సజన్ నాయక్, అనిల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో మన్సూరికి వినత్పత్రం అందజేశారు.